మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లాలో మైనర్లు, యువకులను లైంగికంగా వేధించిన కేసులో చేతన్ ప్రకాశ్ కోలీ (22)ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి మొబైల్ ఫోన్‌లో 600కుపైగా అభ్యంతరకర వీడియోలు ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు. డబ్బు ఆశ చూపి మైనర్లను తనకు అనుకూలంగా మార్చుకుని, అనంతరం వీడియోలతో బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. గత నాలుగేళ్లుగా ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని పేర్కొన్నారు.
నాలుగేళ్లుగా మైనర్లపై వేధింపులు.. నిందితుడి ఫోన్‌లో 600కుపైగా వీడియోలు


