రాష్ట్రంలో 1.05 కోట్ల స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. నకిలీ కార్డులు, అక్రమాలకు అడ్డుకట్ట వేసేలా ట్యాంపర్ ప్రూఫ్, లామినేటెడ్ కార్డులను రూపొందించారు. కార్డుల్లోని వివరాలను మార్చే అవకాశం లేకుండా వీటిని తయారు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈకేవైసీ పూర్తైన తర్వాత ఆధార్ ఆధారంగా ఇంటి యజమాని లేదా ఇల్లాలి ఫొటోతో కూడిన స్మార్ట్ రేషన్ కార్డులను అందించనున్నట్లు సమాచారం.
స్మార్ట్ రేషన్ కార్డులు.. అక్రమాలకు చెక్!


