ఫార్చ్యూన్ సన్‌ఫ్లవర్ ఆయిల్ తయారీ సంస్థ ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్‌కు భారీ జరిమానా విధించారు.
సన్‌ఫ్లవర్ ఆయిల్‌లో నిర్దేశిత స్థాయిలో విటమిన్లు లేవని నాణ్యత పరీక్షల్లో గుర్తించినట్లు సమాచారం. దీంతో సంబంధిత ఆహార భద్రతా అధికారులు ఉత్పత్తిని నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేదని ప్రకటించారు.
అయితే తమ ఉత్పత్తి సురక్షితమైనదేనని కంపెనీ స్పష్టం చేసింది. ఈ అంశంపై న్యాయపోరాటం చేస్తామని వెల్లడించింది.


