29 C
Hyderabad
Wednesday, September 16, 2026
HomeEditorial13న మండల పరిషత్ సర్వసభ్య సమావేశం
Advertisement spot_img

13న మండల పరిషత్ సర్వసభ్య సమావేశం

Must read

తిప్పర్తి: ఈ నెల 13న తిప్పర్తి మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో ఎంఏ సమద్ తెలిపారు. సమావేశానికి మండల స్థాయి అధికారులు తమ పరిధిలోని గ్రామాల సమస్యలు, సంబంధిత పూర్తి సమాచారంతో హాజరు కావాలని సూచించారు.

అధికారులు సమయపాలన పాటిస్తూ ఉదయం 10:30 గంటలకు సమావేశానికి హాజరు కావాలని కోరారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావాలని ఎంపీడీవో కోరారు.

- Advertisement -spot_img

More articles

Latest article

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.