తిప్పర్తి: ప్రజా సమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాలని బీజేపీ నాయకులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తిప్పర్తి మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు వంగూరి రవి అధ్యక్షతన బీజేపీ మండల కార్యవర్గ సమావేశం జరిగింది.
సమావేశంలో ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం, ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని నిర్వహించడం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చించారు. మండలంలోని స్మశాన వాటికలు, గ్రేవ్‌యార్డులు, విద్యుత్ కోతలు తదితర సమస్యలపై ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారు
తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని నాయకులు కార్యకర్తలకు సూచించారు. అనంతరం గోలి మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో ‘తిరంగా యాత్ర’లో భాగంగా మండల కేంద్రంలో జాతీయ జెండాను ఎగురవేశారు.
కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యుడు కొండూరు శ్రీనివాస్, మాజీ మండల అధ్యక్షుడు గుండా వినయ్‌కుమార్, ఎర్రగడ్లగూడెం ఉపసర్పంచ్ పగిడోజు భాస్కరాచారి, మండల ప్రధాన కార్యదర్శి ధర్నపోయిన గంగాధర్, మండల ఉపాధ్యక్షుడు నల్లబోతు రమేష్, సీనియర్ నాయకులు ఎల్లంల శ్రీనివాస్‌రెడ్డి, పగిడోజు బ్రహ్మచారి, నల్గొండ బిక్షం, బీజేవైఎం మండల అధ్యక్షుడు దేశోజు శివశంకర్, కార్యదర్శి వల్లం మాధవరెడ్డి, దళిత మోర్చా మండల అధ్యక్షుడు సుంకిశాల సైదులు, బీజేపీ మండల కమిటీ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు..


