29 C
Hyderabad
Wednesday, September 16, 2026
Homeతెలంగాణనల్లగొండ గురుకులాల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
Advertisement spot_img

నల్లగొండ గురుకులాల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Must read

నల్లగొండ, ఆగస్టు 13: నల్లగొండ జిల్లాలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను పార్ట్‌టైమ్ విధానంలో భర్తీ చేసేందుకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

గురుకుల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న వివిధ సబ్జెక్టుల పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. పోస్టుల్లో తెలుగు, ఇంగ్లీష్, గణితశాస్త్రం, బోటనీ, కెమిస్ట్రీ, జువాలజీ, హిందీ, సోషల్ తదితర సబ్జెక్టులతో పాటు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పోస్టులు ఉన్నాయి.

అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 14 నుంచి ఆగస్టు 22, 2026 సాయంత్రం 5 గంటల వరకు సంబంధిత గురుకుల విద్యాలయాల సంస్థ ప్రాజెక్టు సమన్వయాధికారికి దరఖాస్తులు సమర్పించాలి.

అభ్యర్థుల ఎంపికలో విద్యార్హతలు, సబ్జెక్ట్‌లో పీజీ/బీఈడీ అర్హతలు తదితర నిబంధనలను పరిగణనలోకి తీసుకోనున్నారు. ఎంపిక ప్రక్రియలో అర్హత కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు నోటీసులో పేర్కొన్నారు.

ఆగస్టు 24, 2026 ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు TG‌TWRS బాలుర గురుకుల పాఠశాల, అంబటిపూడి నందు ధ్రువపత్రాల పరిశీలన/ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని వివరాలకు 8333925379 నంబర్‌ను సంప్రదించాలని నోటీసులో సూచించారు.

- Advertisement -spot_img

More articles

Latest article

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.