29 C
Hyderabad
Wednesday, September 16, 2026
HomeEditorialములుగు జిల్లాలో దారుణ హత్య
Advertisement spot_img

ములుగు జిల్లాలో దారుణ హత్య

Must read

ఆగస్టు 13 | విజయ కెరటం | ములుగు ప్రతినిధి

ములుగు జిల్లా మంగపేట మండలంలో దారుణ హత్య ఘటన చోటుచేసుకుంది. కమలాపురం గ్రామ శివారులో బుధవారం రాత్రి ఓ వ్యక్తిపై ఇద్దరు వ్యక్తులు గొడ్డళ్లతో దాడి చేసి హత్య చేసినట్లు సమాచారం.

స్థానికుల వివరాల ప్రకారం.. రాత్రి సుమారు 11 గంటల సమయంలో కమలాపురం గ్రామ శివారులో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఇద్దరు వ్యక్తులు బాధితుడిపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వివరాలు, హత్యకు గల కారణాలు, నిందితుల వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సమాచారం.

- Advertisement -spot_img

More articles

Latest article

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.