25.7 C
Hyderabad
Wednesday, September 16, 2026
HomeEditorialప్రభుత్వ హామీల కమిటీ చైర్మన్‌గా ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్
Advertisement spot_img

ప్రభుత్వ హామీల కమిటీ చైర్మన్‌గా ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్

Must read

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి | ఆగస్టు 13 | విజయ కెరటం

తెలంగాణ ప్రభుత్వ హామీల కమిటీ చైర్మన్‌గా ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తెలంగాణ శాసన మండలిలో జరిగిన 2026–27 సంవత్సరానికి సంబంధించిన ప్రాథమిక సమావేశంలో చైర్మన్‌గా పాల్గొని కమిటీ కార్యకలాపాలపై చర్చించారు.

ఈ సందర్భంగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, కమిటీ సభ్యులు భాను ప్రసాద్, రవీందర్, మధుసూదన్‌తో పాటు లెజిస్లేటివ్ సెక్రటేరియట్ అధికారులు నరసింహాచారి, తిరుపతి తదితరులు ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్‌కు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.

ప్రభుత్వం శాసనసభలో ఇచ్చిన హామీల అమలును సమర్థవంతంగా పర్యవేక్షిస్తూ, ప్రజలకు ఇచ్చిన హామీలు సకాలంలో నెరవేరేలా కృషి చేస్తానని ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ తెలిపారు

- Advertisement -spot_img

More articles

Latest article

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.