Sunday, November 1, 2026
Homeతాజా వార్తలుఅర్నాబ్ తుఫాన్ ఎఫెక్ట్.. తీర ప్రాంతాల్లో హై అలర్ట్!

అర్నాబ్ తుఫాన్ ఎఫెక్ట్.. తీర ప్రాంతాల్లో హై అలర్ట్!

📰 Generate e-Paper Clip

అర్నాబ్ తుఫాన్ ఎఫెక్ట్.. తీర ప్రాంతాల్లో హై అలర్ట్

విజయ కెరటం: అర్నాబ్ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు తీర ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలులు వీస్తుండగా, పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. యానాం నియోజకవర్గం అంతటా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడినట్లు సమాచారం. పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి.

కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంతో పాటు తూర్పుగోదావరి జిల్లాలో గాలుల తీవ్రత కనిపిస్తోంది. రాజమండ్రిలోనూ బలమైన ఈదురు గాలుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తున్నట్లు సమాచారం. పలు చోట్ల విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.

తుఫాన్ ప్రభావం నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉంటున్నారు. రాత్రి సమయంలో తుఫాన్ ప్రభావం ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. అధికారులు సూచించే భద్రతా చర్యలను పాటిస్తూ, అత్యవసర పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.