నవంబర్ 2న తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రా
పర్యటన ఏర్పాట్లపై బీజేపీ నేతల దృష్టి.. డీజీపీకి వినతిపత్రం
హైదరాబాద్, అక్టోబర్ 27 (విజయ కెరటం): కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నవంబర్ 2న తెలంగాణ రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో బీజేపీ నాయకులు పర్యటన ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అనుమతులు, భద్రతా ఏర్పాట్లు కల్పించాలని కోరుతూ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావుతో కలిసి పలువురు బీజేపీ నేతలు రాష్ట్ర డీజీపీకి వినతిపత్రం సమర్పించారు.
అమిత్ షా పర్యటనలో భాగంగా నిర్వహించే పార్టీ కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని నేతలు కోరారు. ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రశాంత వాతావరణంలో కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు పోలీస్ శాఖ తగిన సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.




