Sunday, November 1, 2026
Homeక్రైమ్రూ10 లక్షల నుంచి రూ.లక్షకు తగ్గిన లంచం డిమాండ్‌.. న్యాయ రిమాండ్‌కు తరలింపు

రూ10 లక్షల నుంచి రూ.లక్షకు తగ్గిన లంచం డిమాండ్‌.. న్యాయ రిమాండ్‌కు తరలింపు

📰 Generate e-Paper Clip

బంజారాహిల్స్ ఎస్‌ఐపై ఏసీబీ కేసు నమోదు

 

.రూ10 లక్షల నుంచి రూ.లక్షకు తగ్గిన లంచం డిమాండ్‌.. న్యాయ రిమాండ్‌కు తరలింప

హైదరాబాద్, అక్టోబర్ 28 (విజయ కెరటం): హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న సబ్‌ ఇన్‌స్పెక్టర్ కొట్టూర్ విజయ్‌పై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) క్రిమినల్ దుష్ప్రవర్తన కేసు నమోదు చేసింది. ఫిర్యాదుదారుడిపై నమోదైన రెండు కేసుల్లో అరెస్టు చేయకుండా ఉండటంతో పాటు, తదుపరి కేసులు నమోదు కాకుండా సహకరించేందుకు మొదట రూ.10 లక్షలు లంచం డిమాండ్ చేసి, చివరకు రూ.లక్షకు ఒప్పుకున్నట్లు ఏసీబీ వెల్లడించింది.

బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు సంబంధించిన క్రైమ్ నంబర్లు 524/2024, 525/2024 కేసుల్లో ఫిర్యాదుదారుడిని అరెస్టు చేయకుండా ఉండటం, సెక్షన్ 41-A కింద నోటీసులు జారీ చేయడం, వాటికి సమర్పించిన సమాధానాలను ఆమోదించడం వంటి అధికారిక చర్యలకు ప్రతిఫలంగా లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ ప్రెస్‌నోట్‌లో పేర్కొంది.

అధికార విధులను దుర్వినియోగం చేసి అక్రమ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు రావడంతో ఎస్‌ఐని నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి న్యాయ రిమాండ్‌కు తరలించినట్లు తెలిపింది. ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉంది. ఫిర్యాదుదారుడి భద్రత దృష్ట్యా వివరాలను వెల్లడించలేదని ఏసీబీ స్పష్టం చేసింది.

లంచం డిమాండ్ చేస్తే 1064కు ఫోన్ చేయండి

ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. వాట్సాప్ నంబర్ 9440446106 ద్వారా కూడా సమాచారం అందించవచ్చని తెలిపారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.