దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు కీలక సూచన వెలువడింది. గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి కుటుంబం .ఆగస్టు 16లోపు ఈ-కేవైసీ పూర్తి చేయాలని చమురు మార్కెటింగ్ సంస్థలు ఆదేశించాయి.
ఇటీవల ఎల్పీజీ బుకింగ్, డెలివరీ విధానాల్లోపలు మార్పులు చోటుచేసుకోగా, వాణిజ్య,గృహ వినియోగ సిలిండర్ల ధరలు కూడారెండుసార్లు పెరిగాయి. ఈ నేపథ్యంలోఈ-కేవైసీని తప్పనిసరి చేస్తూ కొత్తనిబంధనను అమల్లోకి తీసుకొచ్చారు.
గ్యాస్ ఏజెన్సీల వద్ద రద్దీని తగ్గించేందుకుడెలివరీ సిబ్బంది ఇంటి వద్దకే వెళ్లిఈ-కేవైసీ నిర్వహించే సౌకర్యాన్నిఅందుబాటులోకి తీసుకొచ్చినా, పలుసాంకేతిక సమస్యలు వినియోగదారులనుఇబ్బందులకు గురిచేస్తున్నాయి.
కనెక్షన్దారులు విదేశాల్లో ఉండటం,మరణించడం, వృద్ధుల వేలిముద్రలునమోదు కాకపోవడం, ఆధార్ వివరాలుగ్యాస్ కనెక్షన్ వివరాలతో సరిపోలకపోవడం,ఒకే కుటుంబంలో రెండు కనెక్షన్లు ఉండటంవంటి సమస్యలు కొనసాగుతున్నాయి.
ఈ కారణాలతో అనేక కుటుంబాలుఈ-కేవైసీ పూర్తి చేయడంలో ఇబ్బందులుఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వం నిర్ణయించినగడువులోపు ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలనిఅధికారులు వినియోగదారులకు సూచిస్తున్నారు.


