29 C
Hyderabad
Wednesday, September 16, 2026
Homeతెలంగాణఆగస్టు 15 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ
Advertisement spot_img

ఆగస్టు 15 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ

Must read

తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టనుంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు.

రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఒకేసారి కార్డుల పంపిణీ చేపట్టేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. అర్హులైన లబ్ధిదారులకు పారదర్శకంగా కార్డులు అందజేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

తొలి దశలో సుమారు 1.05 కోట్ల స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు సమాచారం. కొత్త కార్డులతో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు మరింత సులభతరం కావడంతో పాటు లబ్ధిదారులకు మెరుగైన సేవలు అందనున్నాయి. ప్రభుత్వం విడుదల చేసే తుది మార్గదర్శకాల ప్రకారం పంపిణీ ప్రక్రియ కొనసాగనుంది.

- Advertisement -spot_img

More articles

Latest article

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.