సీసీ కెమెరాలు, టెక్నికల్ ఆధారాలతో అంతర్రాష్ట్ర బైక్ దొంగను నల్లగొండ టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల దర్యాప్తులో నిందితుడిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మొత్తం 36 బైక్ చోరీ కేసులు ఉన్నట్లు గుర్తించారు.
నెల్లూరు, నల్లగొండ, హైదరాబాద్, సంగారెడ్డి, విజయవాడ తదితర ప్రాంతాల్లో నిందితుడు బైక్‌లను చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
సీసీ కెమెరాల ఫుటేజీని విశ్లేషించడంతో పాటు, టెక్నికల్ ఆధారాలను సేకరించి పోలీసులు నిందితుడి కదలికలను గుర్తించారు. అనంతరం చాకచక్యంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఆపరేషన్‌లో ప్రతిభ కనబరిచిన సీఐ A. అదిరెడ్డి, ఎస్‌ఐ D. సైదాబాబు, హెడ్ కానిస్టేబుల్ రాజు, మొహమ్మద్ షకీల్ పాటు పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు


