25.7 C
Hyderabad
Wednesday, September 16, 2026
Homeతెలంగాణహైదరాబాద్సీపీ సజ్జనార్‌పై మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేసిన ఉదయ్ కృష్ణారెడ్డి
Advertisement spot_img

సీపీ సజ్జనార్‌పై మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేసిన ఉదయ్ కృష్ణారెడ్డి

Must read

హైదరాబాద్: ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి తన కస్టడీ సమయంలో పోలీసులు అనుచితంగా వ్యవహరించారని ఆరోపిస్తూ ఉప్పర్‌పల్లి మేజిస్ట్రేట్‌ను ఆశ్రయించారు. సీపీ సజ్జనార్‌తో పాటు విచారణలో పాల్గొన్న పోలీసులపై ఫిర్యాదు చేశారు.

అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఉదయ్ కృష్ణారెడ్డి కస్టడీ ముగియడంతో పోలీసులు ఆయనను మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా కస్టడీలో తనపై అనుచితంగా ప్రవర్తించారని, దుర్భాషలాడారని, టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి తీసుకెళ్లి వేధింపులకు గురిచేశారని ఆరోపించినట్లు సమాచారం.

అలాగే తన కుటుంబ సభ్యులను ఎన్‌కౌంటర్ చేస్తామని బెదిరించినట్లు సీపీ సజ్జనార్‌పై ఉదయ్ కృష్ణారెడ్డి మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. విచారణ సమయంలో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని కూడా ఆరోపించారు.

సీసీటీవీ కెమెరాలు లేని ప్రదేశంలో తనను విచారించారని ఉదయ్ కృష్ణారెడ్డి ఆరోపించగా, విచారణలో రిటైర్డ్ ఏసీపీ పూర్ణచందర్ రావు ఎలా పాల్గొన్నారంటూ ఆయన తరఫు న్యాయవాదులు ప్రశ్నించారు.

విచారణ సందర్భంగా తనతో పాటు న్యాయవాదులను, ఇతర ట్రైనీ ఐపీఎస్ అధికారులను బెదిరించినట్లు కూడా ఆయన ఆరోపించినట్లు సమాచారం.

ఈ ఫిర్యాదుపై స్పందించిన మేజిస్ట్రేట్.. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. సీసీటీవీ కెమెరాలు లేని ప్రాంతంలో విచారణ ఎలా నిర్వహించారనే అంశంపై రెండు

- Advertisement -spot_img

More articles

Latest article

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.