25.7 C
Hyderabad
Wednesday, September 16, 2026
HomeEditorialగచ్చిబౌలి పోలీసుల భారీ డ్రగ్స్‌ పట్టివేత
Advertisement spot_img

గచ్చిబౌలి పోలీసుల భారీ డ్రగ్స్‌ పట్టివేత

Must read

95.41 గ్రాముల MDMA, 50 గ్రాముల OG కుష్‌ స్వాధీనం.. రూ.16.40 లక్షల విలువ

హైదరాబాద్‌: గచ్చిబౌలి పోలీసులు, SOT సైబరాబాద్‌ బృందాలు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ముగ్గురు డ్రగ్స్‌ పెడ్లర్లను అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 95.41 గ్రాముల MDMA, 50 గ్రాముల OG కుష్‌ స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ సుమారు రూ.16,40,920గా పోలీసులు తెలిపారు. మరోవైపు 16 మంది డ్రగ్స్‌ వినియోగదారులను కూడా అదుపులోకి తీసుకున్నారు.

స్వాధీనం చేసుకున్నవి

MDMA – 95.41 గ్రాములు – విలువ రూ.11,40,920

OG కుష్‌ – 50 గ్రాములు – విలువ రూ.5,00,000

రెండు సెల్‌ఫోన్లు

అరెస్టైన నిందితులు

ఎండీ రజల్‌ అబ్దుల్‌ గఫూర్‌ (26) – బెంగళూరులో వ్యాపారం. స్వస్థలం త్రిశూర్‌, కేరళ.

నవీనా కేడీ (22) – బెంగళూరులో వ్యాపారం. స్వస్థలం త్రిశూర్‌, కేరళ.

కొరిపెల్ల యశ్వంత్‌ సాయి షణ్ముఖ్‌ (26) – నిరుద్యోగి, మూసాపేట, కూకట్‌పల్లి. స్వస్థలం తూర్పుగోదావరి, ఆంధ్రప్రదేశ్‌.

కేసు వివరాలు:

ఆగస్టు 11న వట్టినాగులపల్లిలోని కిండమ్‌ పబ్‌ రోడ్డులో యశ్వంత్‌ సాయి షణ్ముఖ్‌ను 16 మంది వినియోగదారులతో కలిసి పోలీసులు అరెస్ట్‌ చేశారు. విచారణలో తాను MDMAను కేరళకు చెందిన ఎండీ రజల్‌ అబ్దుల్‌ గఫూర్‌, బెంగళూరుకు చెందిన నవీనా కేడీ నుంచి కొనుగోలు చేసినట్లు వెల్లడించాడు.

దీంతో ప్రత్యేక బృందాలను కేరళ, బెంగళూరుకు పంపిన పోలీసులు.. ఆగస్టు 18న త్రిశూర్‌లో రజల్‌ అబ్దుల్‌ గఫూర్‌ను అరెస్ట్‌ చేశారు. విచారణలో తాను 44.41 గ్రాముల MDMAను యశ్వంత్‌కు ఇచ్చినట్లు, దాన్ని ‘సామ్‌’ అనే నైజీరియన్‌ వ్యక్తి నుంచి సేకరించినట్లు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.

అదే రోజు బెంగళూరులోని బెగూర్‌లో నవీనా కేడీని అరెస్ట్‌ చేశారు. ఆమె నివాసంలో తనిఖీలు నిర్వహించగా 51 గ్రాముల MDMA, 50 గ్రాముల OG కుష్‌ లభించాయి. ఈ డ్రగ్స్‌ను కేరళకు చెందిన తన స్నేహితుడు అనేశ్వర్‌ నుంచి సేకరించినట్లు నవీనా విచారణలో వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.

ఈ కేసులో NDPS చట్టంలోని సెక్షన్‌ 27(B), 8(C), 22(C) కింద గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

ఈ ఆపరేషన్‌ సీరియలింగంపల్లి జోన్‌ DCP చె. శ్రీనివాస్, SOT సైబరాబాద్‌ DCP శోభన్‌ కుమార్, ఇతర పోలీసు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో నిర్వహించారు.

పోలీసుల సూచన:

డ్రగ్స్‌, గంజాయి సరఫరాకు సంబంధించిన సమాచారం ఉంటే ప్రజలు వెంటనే పోలీసులకు తెలియజేయాలని అధికారులు కోరారు. డయల్‌ 100 లేదా సైబరాబాద్‌ వాట్సాప్‌ నంబర్‌ 8712663061కు సమాచారం ఇవ్వవచ్చని తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు.

విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థుల కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, డ్రగ్స్‌ లేదా గంజాయి వినియోగం/సరఫరాకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

- Advertisement -spot_img

More articles

Latest article

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.