నిరుపేదలకు అండగా మాజీ ఎంపీపీ రేగట్టే నిర్మల నరసింహారెడ్డి
30 నిరుపేద కుటుంబాలకు 80 గజాల చొప్పున వ్యవసాయ భూమి దానం
చెరువుగట్టు, (విజయ కెరటం): గ్రామంలోని ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచేందుకు చెరువుగట్టు గ్రామ మాజీ సర్పంచ్, మాజీ చైర్మన్, నార్కట్‌పల్లి మాజీ ఎంపీపీ రేగట్టే నిర్మల నరసింహారెడ్డి ముందుకొచ్చారు. సుమారు 30 నిరుపేద కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 80 గజాల చొప్పున తన సొంత వ్యవసాయ భూమిని ఇళ్ల నిర్మాణం కోసం దానం చేశారు.
గ్రామంలో ఇల్లు లేని పేదలందరికీ ఇళ్ల నిర్మాణం కోసం భూమి అందించడంతో పాటు, వారు సొంతంగా ఇళ్లు నిర్మించుకునేలా తన వంతు కృషి చేస్తానని నిర్మల నరసింహారెడ్డి తెలిపారు. నిరుపేద కుటుంబాలకు సొంతింటి కల నెరవేర్చేందుకు సహకరిస్తానని హామీ ఇచ్చారు.




