Monday, October 26, 2026
Google search engine
Homeతెలంగాణఅన్ని రకాల వరి ధాన్యానికి రూ.500 బోనస్ ఇవ్వాలి దసరా లోపే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి:...

అన్ని రకాల వరి ధాన్యానికి రూ.500 బోనస్ ఇవ్వాలి దసరా లోపే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి: బీజేపీ రాష్ట్ర నాయకుడు పాలకూరి రవి గౌడ్

📰 Generate e-Paper Clip

అన్ని రకాల వరి ధాన్యానికి రూ.500 బోనస్ ఇవ్వాలి

 

దసరా లోపే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి: బీజేపీ రాష్ట్ర నాయకుడు పాలకూరి రవి గౌడ్

నల్గొండ, అక్టోబర్ 16 (విజయ కెరటం): అన్ని రకాల వరి ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు పాలకూరి రవి గౌడ్ డిమాండ్ చేశారు. దసరా పండుగ లోపే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరారు.

 

ఈ సందర్భంగా రవి గౌడ్ మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావం, విద్యుత్ కోతలు, వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. కొద్దో గొప్పో పండిన పంటకు కూడా సరైన ధర లభించక పెట్టుబడులు తిరిగి వచ్చే పరిస్థితి లేదన్నారు. సన్న రకాలతో సహా అన్ని రకాల వరి ధాన్యానికి మద్దతు ధరతో పాటు అదనంగా రూ.500 బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు.

 

వరి కోతలు ప్రారంభమైన నేపథ్యంలో మిల్లర్లు, దళారులు రైతులను తక్కువ ధరకు ధాన్యం అమ్ముకునేలా ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. బియ్యం ధరలు రెట్టింపైనప్పటికీ వరి ధాన్యం ధరలు ఎందుకు పెరగడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ అంశంపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

 

ప్రస్తుత పరిస్థితుల్లో రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, దళారుల మాటలు నమ్మి తక్కువ ధరకు ధాన్యం విక్రయించవద్దని రైతులకు భరోసా కల్పించాలని పాలకూరి రవి గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.