### బీపీఎల్ ముస్లిం విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు.. నవంబర్ 15 వరకు దరఖాస్తులు
ఎంబీబీఎస్, బీడీఎస్, బీవీఎస్సీ విద్యార్థులకు అవకాశ
నల్గొండ, అక్టోబర్ 15 (విజయ కెరటం): నల్గొండలోని ఇడారా-ఎ-ఇఖామత్ ఖానా బహదూర్ ఖాన్ సంస్థ ఆధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి బీపీఎల్ పరిధిలోని పేద ముస్లిం విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఎంబీబీఎస్, బీడీఎస్, బీవీఎస్సీ వంటి ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న, పాత నల్గొండ జిల్లా పరిధికి చెందిన అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్వాహకులు సూచించారు.
కావాల్సిన పత్రాలు:
* ఆధార్ కార్డు
* తెల్ల రేషన్ కార్డు (ఎఫ్‌ఎస్‌సీ)
* ప్రస్తుత విద్యా సంవత్సరపు బోనఫైడ్ సర్టిఫికెట్
* గత విద్యా సంవత్సరం మార్కుల మెమో
* రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు
అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15, 2026 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. పూర్తి చేసిన దరఖాస్తులను పని దినాల్లో ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 8:30 గంటల వరకు నల్గొండలోని ఇడారా కార్యాలయంలో సమర్పించాలి.
మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్లు:
* అధ్యక్షుడు మొహమ్మద్ షాహిద్ అహ్మద్: 9912214835
* కార్యదర్శి మొహమ్మద్ షఫీ నవాజ్ ఖాన్: 9052342745
* కార్యా
లయ ఇన్‌చార్జి: 9398667017




