Sunday, November 22, 2026
Homeతెలంగాణముస్లింలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి

ముస్లింలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి

📰 Generate e-Paper Clip

ముస్లింలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాల

 

గవర్నర్ కోటాలో ఖాళీ అయ్యే మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి కేటాయించాలి – మౌలానా షా సయ్యద్ ఎహ్సానుద్దీన్

నల్లగొండ, నవంబర్ 5 (విజయ కెరటం ప్రతినిధి):

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ముస్లిం సమాజానికి రాజకీయ పదవుల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించాలని తెలంగాణ రాష్ట్ర జమీయత్ ఉలమా ఏ హింద్ అధ్యక్షుడు మౌలానా షా సయ్యద్ ఎహ్సానుద్దీన్ రషాదీ డిమాండ్ చేశారు. గవర్నర్ కోటాలో ఖాళీ కానున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో కనీసం ఒక స్థానాన్ని ముస్లింలకు కేటాయించాలని కోరారు.

ముస్లింల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ పదవులు, కార్పొరేషన్ చైర్మన్ నియామకాల్లో ముస్లిం నాయకులకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పాత చైర్మన్ల పదవీకాలాన్ని పొడిగించకుండా కొత్తవారికి అవకాశం కల్పించాలని సూచించారు.

మైనారిటీ సబ్‌ప్లాన్‌ను తక్షణమే అమలు చేయాలని, బడ్జెట్ కేటాయింపుల్లో న్యాయం చేయడంతో పాటు పెండింగ్‌లో ఉన్న మైనారిటీ సబ్సిడీ పథకాలను వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎన్నికల్లో ముస్లిం అభ్యర్థులకు టికెట్లు కేటాయించడమే కాకుండా, వారి విజయానికి మంత్రులు, పార్టీ నాయకత్వం బాధ్యత తీసుకోవాలని అన్నారు.

ముస్లిం అభ్యర్థుల ఓటమికి పార్టీ నాయకత్వం సహకరించకపోవడమే కారణమైతే సంబంధిత మంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో రాజ్యసభ ప్రాతినిధ్యం కోరినా పట్టించుకోలేదని, ఇప్పుడు ఎమ్మెల్సీ స్థానాల విషయంలోనూ నిర్లక్ష్యం చేయడం తగదన్నారు.

ముస్లింల రాజకీయ, విద్యా, ఆర్థిక హక్కులకు తగిన ప్రాధాన్యత కల్పించకపోతే కాంగ్రెస్‌తో భవిష్యత్ రాజకీయ వ్యూహంపై పునరాలోచించాల్సి వస్తుందని జమీయత్ ఉలమా హెచ్చరించింది.

ముస్లింల ఓట్లతో అధికారం.. రాజకీయ పదవుల్లో వాటా ఎప్పుడు? అని మౌలానా షా సయ్యద్ ఎహ్సానుద్దీన్ రషాదీ ప్రశ్నించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.