ఉమ్మడి నల్గొండ జిల్లాలో జాతీయ రహదారులపై జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు.
నార్కట్‌పల్లిలో ముందుగా వెళ్తున్న వాహనాన్ని DCM ఢీకొనడంతో డ్రైవర్ శ్రీనివాస్ మృతి చెందారు. నకిరేకల్‌లో ఆగి ఉన్న DCMను బైక్ ఢీకొనడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
తూప్రాన్‌పేట వద్ద రోడ్డు దాటుతున్న గుర్తుతెలియని వ్యక్తిని DCM ఢీకొనడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే చిట్యాలలో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు సమాచారం.
వరుస ప్రమాదాలతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో విషాదం నెలకొంది.


