శ్రీశైలం జాలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం డ్యాంలోకి 2,07,821 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుండగా, 30,518 క్యూసెక్కుల నీటిని ఔట్‌ఫ్లోగా దిగువకు విడుదల చేస్తున్నారు.
డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 873.20 అడుగుల నీటిమట్టం నమోదైంది. అలాగే పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 155.2652 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
ఇదిలా ఉండగా, జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో శ్రీశైలం కుడి, ఎడమ ఒడ్డు విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తిని అధికారులు ప్రారంభించారు. వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అవసరానికి అనుగుణంగా నీటి విడుదలపై అధికారులు నిర్ణయాలు తీసుకుంటున్నారు.


