ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం భారీగా పెరిగింది. వరద నీటిని దిగువకు విడుదల చేసేందుకు అధికారులు ప్రాజెక్టులోని 26 గేట్లను ఎత్తివేశారు.
📌 ప్రాజెక్టు తాజా వివరాలు:
- ఇన్‌ఫ్లో: 2,20,000 క్యూసెక్కులు
అవుట్‌ఫ్లో: 2,11,615 క్యూసెక్కులు
పూర్తిస్థాయి నీటిమట్టం (FRL): 318.516 మీటర్లు
ప్రస్తుత నీటిమట్టం: 317.80 మీటర్లు
పూర్తిస్థాయి నీటి సామర్థ్యం: 9.657 టీఎంసీలు
ప్రస్తుత నీటి నిల్వ: 8.22 టీఎంసీలు
వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉన్నారు. దిగువ ప్రాంతాల ప్రజలు నది పరివాహక ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.


