నల్లగొండఆగస్టు 5: ఇటీవల, ఆగస్టుఇటీవలఅనారోగ్యంతో మృతి చెందిన ఉర్దూ మీడియం ప్రభుత్వ ఉపాధ్యాయుడు మహమ్మద్ అఫ్జల్ కుటుంబానికి టీఎస్పీటీఏ ఉర్దూ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఉర్దూ మీడియం ఉపాధ్యాయులు సేకరించిన రూ.67 వేల నగదు విరాళాన్ని జమ్మియతుల్ ఉలమాయే హింద్ రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా ఎహ్సానుద్దీన్ ఖాస్మీ కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా మౌలానా ఎహ్సానుద్దీన్ ఖాస్మీ మాట్లాడుతూ, ఆపదలో ఉన్నవారికి చేయూతనివ్వడం ప్రతి ఒక్కరి సామాజిక, మానవీయ బాధ్యత అని అన్నారు. కష్టకాలంలో పరస్పరం అండగా నిలవడం ద్వారా సమాజంలో ఐక్యత, సోదరభావం మరింత బలపడుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మౌలానా అక్బర్, టీఎస్పీటీఏ జిల్లా అధ్యక్షుడు ఎం.ఏ. గఫూర్, ప్రధాన కార్యదర్శి ఎం.డి. షాహిన్ తయ్యబ్, ఉర్దూ ఉపాధ్యాయులు హుసాముద్దీన్, బియభాని, అయూబ్ ఖాన్, బషారత్ అలీ బఖర్, జలాల్ తదితరులు పాల్గొన్నారు.
టీఎస్పీటీఏ ఉర్దూ ఉపాధ్యాయ సంఘం చేపట్టిన ఈ మానవతా కార్యక్రమాన్ని పలువురు ఉపాధ్యాయులు, విద్యావేత్తలు అభినందిస్తూ, ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు.


