25.7 C
Hyderabad
Wednesday, September 16, 2026
HomeతెలంగాణEHSపై కీలక నిర్ణయాలు.. ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు
Advertisement spot_img

EHSపై కీలక నిర్ణయాలు.. ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు

Must read

ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్‌ (EHS)పై హెల్త్ సెక్రటరీ శ్రీమతి క్రిస్టినా జెడ్ చోంక్తు, EHCT కన్వీనర్ శ్రీ హనుమంత్ ఆధ్వర్యంలో TSHA ఆసుపత్రుల యాజమాన్యాలు, ట్రస్ట్ బోర్డు సభ్యులతో అత్యవసర సమావేశం జరిగింది. ఉద్యోగుల ఆరోగ్య సౌకర్యాలపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

EHSకు సంబంధించిన పాత బకాయిల్లో సుమారు రూ.50 కోట్లు ప్రభుత్వం చెల్లించింది. జూలై 31న ఇప్పటికే రూ.20 కోట్లు చెల్లించగా, మొత్తం రూ.70 కోట్ల మేర చెల్లింపులు జరిగినట్లు సమావేశంలో వెల్లడించారు.

అపోలో హాస్పిటల్స్ – జూబ్లీహిల్స్

అపోలో హాస్పిటల్స్ – సికింద్రాబాద్

కేర్ హాస్పిటల్స్ – నాంపల్లి

కేర్ హాస్పిటల్స్ – మలక్‌పేట్

రెన్నోవా హాస్పిటల్స్ – 7 బ్రాంచీలు హైదరాబాద్

రెన్నోవా క్యాన్సర్ హాస్పిటల్ – వరంగల్

మిగిలిన ప్రముఖ ఆసుపత్రులతో చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నెల 21న మరోసారి ఆసుపత్రుల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని అన్ని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో EHS మిత్ర కౌంటర్లు, సహాయకులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ నెల 25లోగా అన్ని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులతో చికిత్సలపై ఒప్పందాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఉద్యోగుల సౌకర్యార్థం టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయడంతో పాటు EHS ట్రస్ట్ డీడ్‌పై సంతకాల ప్రక్రియ పూర్తయింది. EHS ఆపరేషన్ గైడ్‌లైన్స్‌కు ఆమోదం లభించగా, వాటిని అధికారికంగా విడుదల చేయనున్నారు.

- Advertisement -spot_img

More articles

Latest article

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.