29 C
Hyderabad
Wednesday, September 16, 2026
Homeఅంతర్జాతీయంమెస్సీ తండ్రి కన్నుమూత.. కుటుంబంలో విషాదం
Advertisement spot_img

మెస్సీ తండ్రి కన్నుమూత.. కుటుంబంలో విషాదం

Must read

అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ తండ్రి జార్డ్ మెస్సీ కన్నుమూసినట్లు సమాచారం. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మృతి చెందడంతో మెస్సీ కుటుంబంలో విషాదం నెలకొంది.

మెస్సీ కెరీర్‌లో తండ్రి జార్డ్ కీలక పాత్ర పోషించారు. చిన్ననాటి నుంచే మెస్సీ ఫుట్‌బాల్ ప్రయాణానికి అండగా నిలిచిన ఆయన.. కుమారుడి విజయాల్లో వెన్నంటే ఉన్నారు.

మెస్సీ టీమ్‌మేట్, సన్నిహితుడు సెస్క్ ఫాబ్రిగాస్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించినట్లు సమాచారం. తండ్రి మృతితో మెస్సీ తీవ్ర విషాదంలో ఉన్నట్లు తెలుస్తోంది.

2026 ఫిఫా వరల్డ్ కప్ సమయంలోనూ మెస్సీ తన తండ్రితో కలిసి కనిపించిన విషయం తెలిసిందే. ప్రపంచ ఫుట్‌బాల్‌లో మెస్సీ ఎదుగుదల వెనుక తండ్రి జార్డ్ ప్రోత్సాహం ఎంతో ఉందని అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు.

మెస్సీ కుటుంబానికి అభిమానులు, ఫుట్‌బాల్ ప్రపంచం సంతాపం వ్యక్తం చేస్తోంది.

- Advertisement -spot_img

More articles

Latest article

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.