నల్గొండ పట్టణంలో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పట్టణంలో ఆవారాగా తిరుగుతూ చెడు వ్యసనాలకు అలవాటు పడి, విలాసవంతమైన జీవితం కోసం ఈ ముఠా దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ముఠా వివరాలు (నిందితులు):
A1: నదీమ్ ,తండ్రి :ఇబ్రహీం, వయస్సు 25 సం. లు, , నివాసం: పంజేష, నల్గొండ పట్టణం
A2: షేక్ రిజ్వాన్ ,తండ్రి :సలీం, వయస్సు: 26 సం,, , వృత్తి: ప్రైవేట్ ఎంప్లాయ్ బజాజ్ ఎలక్ట్రానిక్స్, నివాసం ఇంటి నెం 3-9-91, ఘడి మస్జిద్, నల్గొండ పట్టణం
A3: మహమ్మద్ అబ్దుల్ సమీర్, తండ్రి: షకీల్, వయస్సు 23 సం,, , వృత్తి: ఎలెక్ట్రికల్ వర్క్, నివాసం జామా మస్జిద్, నల్గొండ పట్టణం ప్రస్తుత నివాసం హౌసింగ్ బోర్డు కాలనీ, నల్గొండ పట్టణం
(ముగ్గురు గతం లో నేరాలు చేసి, జైలుకు వెళ్లిన చరిత్ర ఉంది)
రికవరీ చేసిన సొత్తు:
1. 30 తులాల వెండి ఆభరణాలు
2. 4 గ్యాస్ సిలిండర్లు
3. 3 బ్యాటరీలు
4. 4 సెల్ ఫోన్లు
5. ₹14,500 నగదు
పోలీసుల వివరాల ప్రకారం, నల్గొండ పాతబస్తీ ప్రాంతంలో తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని గత రెండు నెలలుగా ఈ ముఠా దొంగతనాలు చేస్తోంది. నమ్మదగిన సమాచారం మేరకు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా, ఐదు దొంగతనాల్లో పాల్పడినట్లు అంగీకరించారు.
డీఎస్పీ ఆదేశాల మేరకు చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్న వన్‌టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐలు సైదులు, వెంకట్ నారాయణతో పాటు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.


