Sunday, November 1, 2026
Homeతాజా వార్తలుహైదరాబాద్‌లో గంజాయి విక్రయాలపై ఈగల్ ఫోర్స్ దాడులు.. 75 ఏళ్ల వృద్ధురాలి అరెస్ట్

హైదరాబాద్‌లో గంజాయి విక్రయాలపై ఈగల్ ఫోర్స్ దాడులు.. 75 ఏళ్ల వృద్ధురాలి అరెస్ట్

📰 Generate e-Paper Clip

హైదరాబాద్‌లో గంజాయి విక్రయాలపై ఈగల్ ఫోర్స్ దాడులు.. 75 ఏళ్ల వృద్ధురాలి అరెస్ట

నలుగురికి కాదు.. 66 మందికి డ్రగ్స్ పరీక్షల్లో పాజిటివ్‌.. ముగ్గురు మైనర్లు

హైదరాబాద్‌ (విజయ కెరటం): నగరంలో గంజాయి విక్రయాలపై ఈగల్ ఫోర్స్ తెలంగాణ అధికారులు దాడులు నిర్వహించారు. ఎల్‌బీఎస్ నగర్, ఫతేనగర్ ప్రాంతాల్లో చేపట్టిన ఆపరేషన్‌లో గంజాయి విక్రయిస్తున్నారనే ఆరోపణలపై 75 ఏళ్ల షేక్ జథేన్ బీని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.

నిందితురాలి వద్ద నుంచి 179.1 గ్రాముల గంజాయితో కూడిన 41 చిన్న ప్యాకెట్లు, రూ.43,340 నగదు, ఒక మొబైల్ ఫోన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఆపరేషన్‌లో సుమారు 70 మంది అనుమానిత వినియోగదారులను గుర్తించగా, వారిలో 66 మందికి THC పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. పాజిటివ్‌గా తేలిన వారిలో ముగ్గురు మైనర్లు ఉన్నారు. మొత్తం 65 మందిని పునరావాసం, వైద్య సహాయం కోసం వివిధ కేంద్రాలకు పంపించారు. వీరిలో 45 మందిని గాంధీ ఆస్పత్రికి, 15 మందిని అమంగల్‌కు, మరో ఐదుగురిని కొత్తూరుకు రిఫర్ చేశారు.

ఈ ఘటనపై NDPS చట్టం, జువెనైల్ జస్టిస్ చట్టాల కింద కేసు నమోదు చేసిన అధికారులు, మరో ఐదుగురు అనుమానితుల కోసం గాలిస్తున్నారు. డ్రగ్స్ విక్రయాలు, వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిస్తే టోల్ ఫ్రీ నంబర్ 1908కు ఫోన్ చేసి తెలియజేయాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి

చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.