నల్లగొండ, ఆగస్టు 20: దేవరకొండ డీఎస్పీ, డిండి సీఐ కార్యాలయాలను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ గురువారం వార్షిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేసుల ఫైల్స్, పెండింగ్ కేసులు, క్రైమ్ రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని, నాణ్యమైన దర్యాప్తుతో పటిష్టమైన సాక్ష్యాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాసరావు, డిండి సీఐ బిసన్న తదితరులు పాల్గొన్నారు.
కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి: ఎస్పీ శరత్ చంద్ర పవార్


