మైనారిటీ విద్యార్థులకు ఉచిత టెట్ కోచింగ
డిసెంబర్ 1 నుంచి తరగతులు ప్రారంభం.. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
నల్గొండ, నవంబర్ 20 (విజయ కెరటం): మైనారిటీ విద్యార్థులకు శుభవార్త. తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG TET–2026)కు సిద్ధమయ్యే మైనారిటీ విద్యార్థుల కోసం నల్గొండలోని ఇడారా-ఏ-ఇఖామత్ ఖానా బహదూర్ ఖాన్ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ నిర్వహించనున్నారు. ఈ శిక్షణ తరగతులు డిసెంబర్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి.
ఉచిత కోచింగ్ పొందాలనుకునే విద్యార్థులు నవంబర్ 20 నుంచి ఇడారా కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని నిర్వాహకులు తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. నల్గొండలోని మాన్యంచల్క వద్ద జిల్లా జైలు పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న ఇడారా కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలి.
డిసెంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే తరగతులు ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు కొనసాగుతాయి. మరిన్ని వివరాలకు ఇడారా అధ్యక్షుడు మహమ్మద్ షాహిద్ అహ్మద్ (9912214835), కార్యదర్శి మహమ్మద్ షఫీ నవాజ్ ఖాన్ (9052342745), కార్యాలయ ఇన్చార్జి (9398667017)ను సంప్రదించాలని నిర్వాహకులు సూ
చించారు.

