నల్గొండ :గొల్లగూడ మేకల అభినవ్ స్టేడియం వద్ద ఈ నెల 7న పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో బైక్‌పై వచ్చిన ఓ మైనర్ బాలుడిని ఏఎస్సై కంచర్ల చంద్రశేఖర్ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
అయితే పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో సదరు బాలుడు ఏఎస్సైని డి కొట్టాడు . ఏఎస్సై ఫిర్యాదు మేరకు బాలుడితో పాటు అతడి తండ్రిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


