రోడ్లు, ఫుట్‌పాత్‌లు, ఇతర ప్రజా ప్రదేశాల్లో మటన్, చేపల విక్రయాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ బి. వంశీకృష్ణ హెచ్చరించారు.
తెలంగాణ మున్సిపాలిటీల చట్టం–2019 ప్రకారం అనుమతి, లైసెన్స్ ఉన్న దుకాణాల్లోనే మాంసం, చేపల విక్రయాలు నిర్వహించాలని సూచించారు. ముఖ్యంగా ఆదివారాల్లో ఫుట్‌పాత్‌లపై జరిగే విక్రయాలపై ప్రత్యేక నిఘా పెట్టనున్నట్లు తెలిపారు.
మాంసం, చేపల వ్యర్థాలను రోడ్లు, డ్రైన్లలో పడేస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే వ్యాపారం నిలిపివేత, ఆక్రమణల తొలగింపు, అవసరమైతే దుకాణాల సీజ్, సామగ్రి స్వాధీనం వంటి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ప్రజారోగ్యం, పారిశుధ్యానికి ఇబ్బంది కలిగించే విధంగా వ్యాపారాలు నిర్వహించవద్దని కమిషనర్ సూచించారు.


