జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా నీటిపారుదల సలహామండలి సమావేశం ప్రారంభమైంది. రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సమావేశంలో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ మేయర్ ఆమీర్ అలీతో పాటు పలువురు మార్కెట్ కమిటీ, మున్సిపల్ చైర్మన్లు, ఇరిగేషన్, రెవెన్యూ, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
జిల్లాలో ప్రస్తుత వర్షపాతం, భూగర్భ జలాల పరిస్థితిపై అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. రానున్న రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు.

మంత్రి కీలక ఆదేశాలు:
🔹 వర్షపాతాన్ని క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా పరిశీలించాలి
🔹 భూగర్భ జలాల పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
🔹 జలసిరి ద్వారా భూగర్భ జలాలను పెంచే చర్యలు చేపట్టాలి
🔹 ఫార్మ్ పాండ్లపై ప్రత్యేక దృష్టి సారించాలి
🔹 మున్సిపాలిటీల్లో ఇంటి నిర్మాణ అనుమతులకు ఇంకుడు గుంత తప్పనిసరి చేయాలి
🔹 పడే ప్రతి వాననీటి చుక్కను ఒడిసిపట్టేలా చర్యలు చేపట్టాలి
🔹 వాల్టా చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి
భూగర్భ జలాల పరిరక్షణకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు.


