హైదరాబాద్‌లోని ఇనార్బిట్ మాల్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి ముఖి అనే యువతి మృతి చెందింది.
లభించిన సమాచారం ప్రకారం.. జనసేన పార్టీ ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు సంజుష్ నడుపుతున్న కారు రోడ్డు దాటుతున్న భారతిని ఢీకొట్టినట్లు తెలుస్తోంది. లైఫ్‌స్టైల్‌లో పనిచేస్తున్న భారతి.. లంచ్ కోసం ఐటీసీ కోహినూర్ సమీపంలోని ఫుడ్ స్టాళ్లకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భారతిని అదే కారులో అపోలో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం.
ఈ ఘటనపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం సంజుష్‌కు స్టేషన్ బెయిల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి కారణమైన కారు Aston Martin DBX అని, దాని విలువ సుమారు రూ.5.5 కోట్లు అని సమాచారం.
ప్రమాదం ఆదివారం జరిగినప్పటికీ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.


