Sunday, November 22, 2026
Homeతెలంగాణనల్లగొండకు 480 ఇందిరమ్మ టవర్స్ ఇళ్లు మంజూరు

నల్లగొండకు 480 ఇందిరమ్మ టవర్స్ ఇళ్లు మంజూరు

📰 Generate e-Paper Clip

నల్లగొండకు 480 ఇందిరమ్మ టవర్స్ ఇళ్లు మంజూర

పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం: మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి

నల్లగొండ, నవంబర్ 11 (విజయ కెరటం): నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 480 ఇందిరమ్మ టవర్స్ ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 579 విడుదల చేయడంపై నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నల్లగొండ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

సొంత ఇళ్లు లేని పేద, ఆర్థికంగా బలహీన వర్గాల కుటుంబాలకు సొంతింటి కలను నెరవేర్చడమే ఇందిరమ్మ టవర్స్ పథకం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. పట్టణంలోని అర్హులైన పేద కుటుంబాలకు ఈ పథకం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు.

ఒక్కో ఇంటి నిర్మాణ వ్యయాన్ని రూ.8.50 లక్షలుగా నిర్ణయించగా, అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.5 లక్షల సబ్సిడీ అందించేందుకు ఆమోదం తెలిపిందని వెల్లడించారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వం పట్టణ అభివృద్ధితో పాటు పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు కృషి చేస్తోందని మేయర్ తె

లిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.