Sunday, November 22, 2026
Homeక్రైమ్ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని రైల్వే ట్రాక్ దాటుతూ.. రైలు ప్రమాదంలో యువకుడి మృతి

ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని రైల్వే ట్రాక్ దాటుతూ.. రైలు ప్రమాదంలో యువకుడి మృతి

📰 Generate e-Paper Clip

ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని రైల్వే ట్రాక్ దాటుతూ.. రైలు ప్రమాదంలో యువకుడి మృతి

గజపతినగరం, నవంబర్ 11 (విజయ కెరటం):

చెవిలో ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని రైల్వే ట్రాక్ దాటుతున్న ఓ యువకుడు రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. విజయనగరం జిల్లా గజపతినగరంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పురిటిపెంట గ్రామానికి చెందిన పవన్ కల్యాణ్ (21) రైలు ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు.

చెవిలో ఇయర్‌ఫోన్స్ ఉండటంతో రైళ్లు వస్తున్న విషయాన్ని గుర్తించలేకపోయిన పవన్.. ఒక రైలును తప్పించుకునే క్రమంలో మరో రైలు ఢీకొనడంతో మృత్యువాత పడ్డాడు.

చెన్నైలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన పవన్, హైదరాబాద్‌లో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు. దీపావళి పండుగ సందర్భంగా స్వగ్రామానికి వచ్చి తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. చేతికి అందివచ్చిన కుమారుడు మృతిచెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

యువత అప్రమత్తంగా ఉండాలి: రైల్వే ట్రాక్‌లు దాటేటప్పుడు ఇయర్‌ఫోన్స్, మొబైల్ ఫోన్ల వినియోగానికి దూరంగా ఉండాలి. రైళ్లు వస్తున్న శబ్దాన్ని గుర్తించలేకపోవడం ప్రాణాలకే ప్రమాదకరంగా మారుతుంది. చిన్నపాటి నిర్లక్ష్యం నిండు జీవితాన్ని బలితీసుకుంటుందని ఈ ఘటన మరోసారి హెచ్చ

రిస్తోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.