Monday, November 23, 2026
Homeజాతీయంతెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌చార్జిగా బీఎం సందీప్

తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌చార్జిగా బీఎం సందీప్

📰 Generate e-Paper Clip

తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌చార్జిగా బీఎం సందీప

మీనాక్షి నటరాజన్ స్థానంలో నియామకం.. ఏఐసీసీ ఉత్తర్వులు జారీ

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నూతన ఇన్‌చార్జిగా బీఎం సందీప్ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఈ బాధ్యతలు నిర్వహించిన మీనాక్షి నటరాజన్ స్థానంలో సందీప్‌ను నియమిస్తూ ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ నియామకానికి ఆమోదం తెలిపినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధికారిక ప్రకటనలో వెల్లడించారు.

కర్ణాటకలోని చిక్కమగళూరు ప్రాంతానికి చెందిన బీఎం సందీప్ ఇండియన్ యూత్ కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ జాతీయ కన్వీనర్‌గా, కర్ణాటక రాష్ట్ర కన్వీనర్‌గా పనిచేశారు.

ప్రస్తుతం ఏఐసీసీ కార్యదర్శిగా కొనసాగుతున్న ఆయన గతంలో గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాలకు కో-ఇన్‌చార్జిగా, కేరళ రాష్ట్రానికి అదనపు ఏఐసీసీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జిగా నియమితులయ్యారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.